వలసబాటలో మయన్మార్ ప్రజలు

యాంగూన్: మయన్మార్‌లో సరిహద్దు గ్రామాలపై సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని థాయ్‌లాండ్‌కు పారిపోతున్నారు. వీరంతా సల్వీన్ నది దాటి థాయ్‌లాండ్‌లోని మే హాంగ్ సన్ ప్రావిన్స్‌కు చేరుకుంటున్నారు. ఆదివారం రాత్రి మూడు వైమానిక దాడులు జరిగాయని మయన్మార్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. భారీగా వలసలను ఆమోదించడానికి తాము సిద్ధంగా లేమని, అయితే మానవ హక్కులను పరిగణనలోకి తీసుకుంటామని థాయ్‌లాండ్ పేర్కొంది. మయన్మార్ ప్రజలు మూటాముల్లె సర్దుకుని ఇండ్లను వదిలి అడవుల్లో తలదాచుకుంటున్నారు.
మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం, ఆహారం ఇవ్వొద్దు
మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం కానీ ఆహారం కానీ ఇవ్వొద్దని అధికారులను, ప్రజలను మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. శరణార్థులు ఎవరైనా తీవ్ర గాయాలతో బాధపడుతుంటే వైద్య సహాయం అందించవచ్చన్నది. మరోవైపు, మయన్మార్‌లో పౌరులను సైన్యం అన్యాయంగా చంపుతున్నదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు.
ఇవీ కూడా చదవండి..
ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో బెంగాల్‌పై లెక్చర్లా..?: మమతాబెనర్జి
ఖుష్బూ దోశ.. స్మృతి ఇరానీ దాండియా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

