న్యూయార్క్: అమెరికాలో దీపావళి పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. దీపావళి రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే బిల్లుపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హూచల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కాథీ హుచల్ మాట్లాడుతూ న్యూయార్క్ సిటీలో ఎన్నో మతాల వాళ్లు కలిసిమెలిసి నివసిస్తున్నారని చెప్పారు. ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.