Pulwama Attack | పుల్వామా దాడి మా పనే.. మీడియా సాక్షిగా ఒప్పుకున్న పాక్
Pulwama Attack | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ (Air Force Official) ఔరంగజేబ్ అహ్మద్ (Aurangzeb Ahmed) ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు.
Pulwama Attack | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ (Air Force Official) ఔరంగజేబ్ అహ్మద్ (Aurangzeb Ahmed) ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు. 2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి (Pulwama Attack) వెనుక తమ హస్తం ఉందని మీడియా సాక్షిగా అంగీకరించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో ఆయన ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.
‘పాకిస్థాన్ జలాలు, భూభాగం, గగనతలానికి, ప్రజలకు ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే తాము సహించబోం. అలాంటి చర్యల్ని ఎన్నటికీ ఉపేక్షించబోం. వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడం. దేశ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా పుల్వామా దాడితో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఔరంగజేబ్ అహ్మద్‌తోపాటు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ, నేవీ అధికార ప్రతినిధి కూడా పాల్గొన్నారు. అయితే, ఔరంగజేబ్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న విషయం మరోసారి బట్టబయలైంది.
పుల్వామా దాడి..
2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఉగ్రదాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు.. అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖ (ఎల్ఓసి)ను దాటి పాకిస్థాన్ వైపున ఉన్న బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ (Balakot Air Strike) చేసింది.
పాకిస్థాన్ ఈశాన్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తున్ఖ్వా తీవ్రవాదుల అడ్డాను తునాతునకలు చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌లో చాలా మంది ముష్కరులు చనిపోయినప్పటికీ పాకిస్థాన్ మిన్నకుండి పోయింది. మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాకిస్థాన్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 కూల్చివేసింది. పాకిస్థాన్ కూడా మన మిగ్-21 విమానాన్ని కూల్చివేసి, వింగ్ కమాండర్ అభినందన్‌ను అరెస్టు చేసింది. అయితే మూడు వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్ ప్రభుత్వం రెండు రోజుల తర్వాత అభినందన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించింది.
Also Read..
Donald Trump | కశ్మీర్ సమస్య.. ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించిన పాక్
Donald Trump | కశ్మీర్ సమస్య కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తా : డొనాల్డ్ ట్రంప్
BrahMos missile | బ్రహ్మోస్ శక్తి గురించి పాకిస్థాన్‌ను అడగండి : యూపీ సీఎం యోగి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

