వ్యాక్సిన్లతో వీర్యకణాలూ తగ్గలేదు.. లైంగిక సామర్థ్యం కూడా

న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పురుషల్లో లైంగిక సామర్థ్యం తగ్గలేదని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ మియామీ పరిశోధకులు తమ నివేదికలో ఈ విషయాన్ని చెప్పారు. రెండు డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో.. వీర్యకణాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. మొత్తం 45 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత వారి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించారు. నిజానికి అమెరికాలో ఓ భయం వ్యాప్తిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతున్నట్లు జనం భయపడుతున్నారు. అయితే మియామీ వర్సిటీ స్టడీ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది.
స్పెర్మ్ కౌంట్..
లైంగిక సామర్థ్య పరీక్షలో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైటజర్ టీకాను, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు టీకాలను ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారు చేశారు. అయితే వారి వీర్యకణాలకు జరిపిన పరీక్షల్లో.. బేస్‌లైన్ స్పెర్మ్ కాన్సెంట్రేషన్, టోటల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియన్లు/ఎంఎల్, 36 మిలియన్లు ఉన్నట్లుగా నిర్ధారించారు. రెండవ డోసు తర్వాత వారిలో వీర్యకణాల సంఖ్య స్వల్పంగా 30 మిలియన్లు/ఎంఎల్, టోటల్ కౌంట్ 44 మిలియన్లకు పెరిగినట్లు తేల్చారు. టీకా తీసుకున్న తర్వాత ఎంత పరిమాణంలో వీర్యం ఉత్పత్తి అవుతున్నది, వీర్యకణాలు దూసుకెళ్లుతున్న తీరు ఎలా ఉందో స్టడీలో నిర్ధారించారు. సీమెన్ వాల్యూమ్‌తో పాటు స్పెర్మ్ మొటిలిటీ కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు చెప్పారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ నివేదికను ప్రచురించారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు
ఆరోగ్యంగా ఉన్న పురుషుల్లో.. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత.. వీర్యకణాల ఉత్పత్తి, సామర్థ్యంలో ఎటువంటి తరుగుదల కనిపించలేదన్నారు. వ్యాక్సిన్‌లో కేవలం ఎంఆర్ఎన్ఏ మాత్రమే ఉన్నదని, కానీ లైవ్ వైరస్ కాదు అని, వీర్యకణాలపై వ్యాక్సిన్లు ప్రభావం చూపడం అసాధ్యమని పరిశోధకులు వెల్లడించారు. ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారు చేసిన వ్యాక్సిన్లు మాత్రమే కాదు.. ఎడినోవైరస్ వెక్టర్ డోసుల్లోనూ లైంగిక సామర్థ్యాన్ని తగ్గించే రసాయనాలు ఏవీ ఉండవన్నారు. ఎడినోవైరస్తో కోవీషీల్డ్ టీకాను తయారు చేశారు.
కోవిడ్ సోకిన వారిలో లైంగిక సామర్థ్యం తగ్గి.. వంధత్వం వచ్చే అవకాశాలు ఉన్నట్లు గత ఏడాది నవంబర్‌లో సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. ఆరు కరోనా రోగుల డేటా ఆధారంగా చైనా పరిశోధకులు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని కేసుల్లో వృషణాల్లో వాపు వచ్చినట్లు కూడా తేలింది. కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారిలో 39 శాతం మందిలో స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు అంచనా వేశారు. కానీ 61 శాతం మందిలో .. వారి వీర్యకణాల్లో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

