శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 08, 2020 , 14:50:20

1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో క‌రోనా బాధితులు

1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో క‌రోనా బాధితులు

చైనాలోని వుహాన్‌లో పుట్టిన క‌రోనా మ‌హ‌మ్మారి దాదాపు ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు విస్త‌రించింది. ప‌లు దేశాల్లో ఈ వైర‌స్ ధాటికి జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఈ ర‌క్క‌సి బారిన ప‌డిన సంఖ్య‌ ఇప్ప‌టికి 15ల‌క్ష‌ల‌కు చేరువైంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి.  ఇప్ప‌టికి  ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14లక్షల 32వేల 984గా ఉంది. అయితే ఇందులో కోలుకున్న వారి సంఖ్య  కేవలం 3లక్షల 2వేల 150గా ఉంది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన వూహాన్ సిటీలో 76రోజుల లాక్ డౌన్ ను అక్క‌డి ప్ర‌భుత్వం ఎత్తివేసింది. వూహాన్ సిటీ ఉన్న హుబే ఫ్రావిన్స్ లో గత నెలలోనే ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ వూహాన్ సిటీలో మాత్రం అప్పుడు ఎత్తివేయలేదు. నేటి నుంచి వూహాన్ లో కూడా లాక్ డౌన్ ఎత్తివేశారు.


logo