లటాకియా: సిరియా సైన్యానికి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు అసద్ సాయుధ విధేయులకు మధ్య జరిగిన ఘర్షణలో 70 మంది దాకా మృతి చెందారని యుద్ధ పర్యవేక్షకుడు ఒకరు శుక్రవారం వెల్లడించారు. ప్రభుత్వ నియంత్రణ లేని తీరంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.
ఈ ఘటన కారణంగా లటాకియా, టార్టస్, వాటి చుట్టుపక్కల ఉన్న పట్ణణాలు, పల్లెలకు అదనపు బలగాలు పంపినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాంతాలను అసద్ విధేయులైన సాయుధులు తమ అధీనంలోకి తీసుకొనేందుకు ప్రయ్నతిస్తున్నట్టు సమాచారం.