French | ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) అధికారిక నివాసంలో తెగిన వేలి (chopped human fingertip) పార్శిల్ కలకలం సృష్టించింది . ఈ వారం మొదట్లో మెక్రాన్ అధికారిక నివాసమైన ఎలిసీ ప్యాలెస్ (Elysee Palace)కు వచ్చిన పార్శిల్ లో తెగిన వేలిని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వేలు.. ప్యాకేజీని పంపించిన వ్యక్తిదే అయి ఉంటుందని పారిస్ ప్రాసిక్యూటర్ అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే ఫ్రాన్స్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. గత నెల పోలీసుల కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించడంతో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వేలాది మంది ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ భవనాలు, వాహనాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. దాదాపు కొన్ని వారాలపాటు ఈ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష భవనానికి తెగిన వేలితో పార్శిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Alia Bhatt | జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇచ్చిన అలియా.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
Delhi Floods | ఇంకా వరద గుప్పిట్లోనే ఢిల్లీ.. వర్ష సూచనతో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ