తినేసిన చైనా బాలిక
బీజింగ్, నవంబర్ 29: చైనాకి చెందిన 14 ఏండ్ల బాలికకు బట్టతల వచ్చింది. ఆమె తలపై ఉండే జుట్టు అంతా ఏమైందా? అని చూస్తే.. అది ఆమె కడుపులోకే వెళ్లింది. తన జుట్టునే ఆ బాలిక తినేసింది. దాదాపు 3 కేజీల జుట్టు కడుపులో పేరుకుపోయింది. దీంతో షాంగ్జి రీజియన్లోని జియాన్ ప్రాంతానికి చెందిన ఆ బాలికకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. కడుపులోని జుట్టు బయటకు తీశారు. పొట్ట అంతా జుట్టుతో నిండిపోయిందని, ఆహారానికి కూడా అందులో ఖాళీ లేదని వైద్యులు పేర్కొన్నారు.