(Chinese missile) బీజింగ్ : అణు సామర్థ్యం కలిగిన హైపర్సోనిక్ క్షిపణిని చైనా ఇటీవల పరీక్షించింది. అయితే, ఈ క్షిపణి మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. చైనా పరీక్షలను అమెరికా రక్షణ వ్యవస్థ పసిగట్టలేకపోయింది. ఈ క్షిపణి పరీక్ష ఆగస్టు నెలలో జరిగినట్లు తెలుస్తున్నది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను మాత్రమే పట్టుకునే సామర్ధ్యం ఉండటం వల్లనే అమెరికన్ వ్యవస్థ గుర్తించలేకపోయినట్లు సమాచారం. అమెరికా వద్ద హైపర్సోనిక్ క్షిపణులను గుర్తించే వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ హైపర్సోనిక్ క్షిపణిని తయారు చేయడంలో చైనా విజయం సాధిస్తే మాత్రం.. అది అమెరికా, జపాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలకు ప్రమాదం కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైపర్సోనిక్ క్షిపణి లక్ష్యం నుంచి 32 కిమీ దూరంలో పడిపోయినట్లు మీడియా వార్తలు నివేదిస్తున్నాయి. చైనా ఈ పరీక్షను పూర్తిగా గోప్యంగా ఉంచింది. పరీక్షలో విఫలమైనప్పటికీ.. హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడంలో దగ్గరలోనే ఉన్నట్లు ప్రపంచానికి చైనా చాటింది. అమెరికా, రష్యా, చైనాతో పాటు ప్రపంచంలోని 5 దేశాలు మాత్రమే ప్రస్తుతం హైపర్సోనిక్ ఆయుధాలను తయారుచేసే పనిలో ఉన్నాయి. చైనా 2019 లో తన వార్షిక కవాతులో ‘డీఎఫ్-17’ అనే పేరు గల హైపర్సోనిక్ క్షిపణి నమూనాను ప్రదర్శించింది.
న్యూక్లియర్ వార్హెడ్లను మోస్తున్న సాధారణ బాలిస్టిక్ క్షిపణుల మాదిరిగానే.. హైపర్సోనిక్ క్షిపణులు కూడా ధ్వని కంటే 5 రెట్లు వేగంగా (గంటకు 6200 కిమీ వేగం) ప్రయాణించి లక్ష్యం చేరుతాయి. ఇవి ప్రయోగించిన తర్వాత ఆకాశంలో ఎక్కువ ఎత్తువ వరకు వెళ్లి తిరిగి లక్ష్యం చేరుకోవడానికి భూమిపైకి వస్తాయి. ఈ హైపర్సోనిక్ క్షిపణులను ఎలాంటి వ్యవస్థలు కూడా గుర్తించలేవు. తైవాన్‌తో పాటు అనేక ఇతర సమస్యలపై చైనా-యూఎస్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను నిర్వహించినట్లుగా తెలుస్తున్నది.
ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మొండిచెయ్యి.. ఇమ్రాన్ ప్రయత్నాలు వృధా
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
మొక్కలను ప్రేమించిన పల్లా వెంకన్న : వెంకయ్యనాయుడు
ఆ రోజు ఎవరికీ కనిపించకుండా పోతాను: సానియా మీర్జా.. ఏ రోజు.. ఎందుకు?
టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు
ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
హైతీలో అమెరికా మిషనరీలు కిడ్నాప్
పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..