పాక్‌కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్.. 30 వేల కోట్లు చెల్లించకుంటే కంపెనీలు మూసేస్తామని హెచ్చరిక
పాకిస్థాన్‌కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 30వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైనా కంపెనీలు పాక్‌ను డిమాండ్ చేశాయి. చెల్లించకుంటే పాకిస్థాన్‌లోని తమ కంపెనీలను మూసివేస్తామని హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మంత్రి ఆసాన్ ఇక్బాల్‌తో సమావేశం అనంతరం చైనీస్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ (ఐపీపీఎస్) ఈ వార్నింగ్ ఇచ్చినట్లు డాన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ ( సీపెక్ )లో భాగంగా 30 చైనా కంపెనీలు పాకిస్థాన్‌లో విద్యుత్ కమ్యూనికేషన్లు, రహదారులు, రైల్వేకు సంబంధించిన, ఇతరత్రా సేవలను అందిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన 30 వేల కోట్ల రూపాయలు సదరు కంపెనీలకు పాకిస్థాన్ ప్రభుత్వం బకాయి పడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆసాన్ ఇక్బాల్‌తో చైనీస్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ మంగళవారం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా తమకు చెల్లించాల్సిన బకాయిల గురించి 25 కంపెనీల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ బకాయిలను తక్షణమే చెల్లించాలని లేదంటే తమ కంపెనీలను తక్షణమే మూసివేస్తామని హెచ్చరించారు. అయితే ఈ అంశంపై పాక్ ప్రధాని షెహబాజ్ దృష్టి సారించారని, నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని సదరు కంపెనీల ప్రతినిధులకు పాక్ మంత్రి ఆసాన్ ఇక్బాల్ హామీ ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

