బీజింగ్, జూలై 24: అంతరిక్షంలో సొంతంగా స్పేస్‌స్టేషన్ నిర్మిస్తున్న చైనా.. ఇందులో భాగంగా ఆదివారం రెండోదశ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. వెంటియాన్ మాడ్యూల్‌ను లాంగ్ మార్చ్ 5బీ వ్యోమనౌక సాయంతో అంతరిక్షంలోకి పంపించింది. చైనాలోని హైనాన్ ద్వీపంలో ఉన్న వెంచాంగ్ లాంచింగ్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. స్పేస్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన మూడు మాడ్యూల్స్‌లో వెంటియాన్ రెండోదని పరిశోధకులు వివరించారు.