China corona cases : చైనాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వరుసగా మూడోరోజు కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 35,183 కేసుల్ని గుర్తించారు. వీటిలో 3,474 కేసులు కొవిడ్-19 లక్షణాలతో ఉన్నాయి. 31,709 మందిలో కరోనా లక్షణాలు బయటపడలేదని శనివారం చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు. గురువారం 32.943 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం వరకు చైనాలో 3,04,093 కొవిడ్ కేసులు రికార్డు అయిన్టటు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ మూడు రోజుల్లో కరోనా మరణాలు మరణాలు మాత్రం సంభవించలేదు. ఇప్పటివరకూ కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా 5,232 మంది చనిపోయారు. ప్రధాన పట్టణాలైన గౌంగ్జో, చోంగ్‌కింగ్‌లో ఎక్కవ కరోనా కేసులు నమోదువుతున్నాయి. కొవిడ్-19 వైరస్‌తో పోరాటం జరుగుతున్న ఈ సమయంలో దేశం చాలా కష్టమైన దశలో ఉందని బీజింగ్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ లీ క్జియవోఫెంగ్ అన్నారు.