Xi Jinping: అణ్వాయుధ దళ అగ్రనేతల్ని తొలగించిన చైనా అధ్యక్షుడు
Xi Jinping: అణ్వాయుధ దళానికి చెందిన ఇద్దరు టాప్ అధికారుల్ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొలగించారు. వారి స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తుల్ని ఆయన నియమించారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్ధ కాలం తర్వాత చైనా మిలిటరీలో ఇంత భారీ స్థాయిలో మార్పు జరిగింది.
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(Xi Jinping) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ దళానికి చెందిన ఇద్దరు టాప్ అధికారుల్ని ఆయన తొలగించారు. వారి స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తుల్ని ఆయన నియమించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ యూనిట్ అధిపతి జనరల్ లీ యుచేవ్‌ను తొలగిస్తూ జీ జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. యుచేవ్‌తో పాటు ఆయన డిప్యూటీపై కూడా వేటు వేశారు. న్యూక్లియర్ ఫోర్స్ కోసం మాజీ నేవీ చీఫ్ వాంగ్ హౌబిన్, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు జూ జిషెంగ్‌లను నియమిస్తూ అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు ఇచ్చారు.
గత దశాబ్ధ కాలంలో ఇది చైనా మిలిటరీలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. న్యూక్లియర్ స్ట్రాటజీలో చైనా తన విధానాన్ని మార్చుకున్నదని, అందుకే ఆ దళానికి చెందిన టాప్ నేతల్ని మార్చివేసినట్లు తెలుస్తోందన్నారు. పీఎల్ఏను అసాధారణ రీతిలో జిన్‌పింగ్ నియంత్రిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కానీ టాప్ ర్యాంకుల్లో ఉన్న నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, దాని పట్ల జిన్‌పింగ్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ఎన్పీటీ సమావేశంలో చైనా పాల్గొన్నది. అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు తమ బాధ్యతల్ని గుర్తుంచుకోవాలని, నిరాయుధీకరణలో భాగంగా కొత్త ఒప్పందాన్ని అమలు చేయాలని చైనా పేర్కొన్నది. ఆ సమావేశాల్లో చైనా విదేశాంగ శాఖకు చెందిన ఆర్మ్స్ కంట్రోల్ శాఖ డైరెక్టర్ జనరల్ సున్ జియాబో మాట్లాడారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియలో న్యూక్లియర్ పవర్ దేశాలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

