గాల్వన్ దాడిపై కామెంట్లు.. చైనా బ్లాగర్‌కు 8 నెలల జైలుశిక్ష

బీజింగ్: గత ఏడాది జూన్‌లో లడాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఆ నాటి ఘటనలో నలుగురు సైనికులు చనిపోయినట్లు ఫిబ్రవరిలో చైనా కూడా ప్రకటించింది. వారిని అమర వీరులు.. హీరోలు అంటూ కీర్తించింది. అయితే చైనాలోని ఓ పాపులర్ బ్లాగర్ మాత్రం తమ దేశ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. గాల్వన్ ఘర్షణలో ఎక్కువ మంది సైనికులు మరణించారని, ప్రభుత్వం మాత్రం నలుగురే అని చెబుతోందని అతను తన బ్లాగ్‌లో రాశాడు. క్వియు జిమింగ్ అనే బ్లాగర్ చేసిన కామెంట్లు చైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. ట్విట్టర్ లాంటి వీబో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో అతనికి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అమరవీరులపై అనుచిత కామెంట్లు చేశారంటూ ఆ బ్లాగర్‌కు శిక్షను ఖరారు చేశారు. మంగళవారం నాన్జింగ్ నగరంలోని కోర్టు.. అతనికి 8 నెలల జైలు శిక్షను విధించింది. జాతీయ హీరోలు, అమరవీరులను కించపరిస్తే వారికి జైలు శిక్షను అమలు చేసే కొత్త నేర చట్టానికి ఇటీవలే చైనా ఆమోదం తెలిపింది. ఆ చట్టం ప్రకారం శిక్ష పడిన మొదటి వ్యక్తి ఇతనే. క్వియు జిమింగ్ తన సోషల్ మీడియా పోస్టుల్లో.. అధికారులు చెప్పిన లెక్కల కన్నా ఎక్కువ సంఖ్యలో సైనికులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు ఘర్షణలో పాల్గొన్న ఓ కమాండింగ్ ఆఫీసర్ ప్రాణాలు దక్కించుకున్నాడని, హైయ్యస్ట్ ర్యాంక్ ఆఫీసర్ కావడం వల్ల అతను సజీవంగా ఉన్నట్లు తన బ్లాగ్‌లో అతను ఆరోపించాడు.
38 ఏళ్ల క్వియును ఫిబ్రవరిలోనే అరెస్టు చేశారు. వీబో.. అతని సోషల్ మీడియా అకౌంట్‌ను బ్యాన్ చేసింది. అమరవీరులను అవమానపరిచినట్లు కోర్టు ముందు క్వియు అంగీకిరంచాడు. ఫిబ్రవరి నుంచి గాల్వన్ ఘటనపై అనుచిత కామెంట్లు చేసిన ఆరుగురిని ఇప్పటి వరకు చైనా అరెస్టు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

