బీజింగ్: అణ్వస్త్ర దాడిని తట్టుకుని నిలిచే తేలియాడే కృత్రిమ దీవిని చైనా నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనిని మెగా సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చైనా ప్రభుత్వ పరిశోధకులు చెప్తున్నారు. ఈ 78,000 టన్నుల బరువైన సెమీ సబ్మెర్సిబుల్ ట్విన్ హాల్ ప్లాట్‌ఫాం ప్రపంచంలో మొదటి సంచార, స్వయం సమృద్ధ కృత్రిమ దీవి.
ఈ ప్రాజెక్టు సారథి, అకడమీషియన్ లిన్ ఝోంగ్కిన్ మాట్లాడుతూ, 2028 నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాలంతో పరుగులు పెడుతున్నామన్నారు. దీనిలో 238 మంది 4 నెలలపాటు బస చేయగలరు. విధ్వంసకరమైన ప్రకంపనలను తట్టుకునేలా మెటామెటీరియల్ శాండ్విచ్ ప్యానెల్స్‌తో దీనిని రూపొందిస్తారు. దీనిలో అత్యవసర విద్యుత్తు, కమ్యూనికేషన్స్, నేవిగేషన్ కంట్రోల్ వంటివి ఉంటాయి.