ముస్లింలపై చైనా అకృత్యాలు.. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆగ్రహం

న్యూయార్క్: చైనాలోని మైనార్టీలపై ఆ దేశం వేధింపులకు పాల్పడుతున్నది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉన్న ఉయిగర్ ముస్లింలతో పాటు ఇతర తెగలకు చెందిన ప్రజలను డ్రాగన్ దేశం అణిచివేస్తున్నది. వ్యవస్థీకృత రీతిలో స్థానిక ముస్లింలను అరెస్టు చేస్తున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషన్ పేర్కొన్నది. మానవత్వానికి వ్యతిరేకంగా చైనా నేరాలకు పాల్పడుతున్నట్లు ఆమ్నెస్టీ ఆరోపించింది. చైనా అకృత్యాలకు సంబంధించిన నివేదికను ఆమ్నెస్టీ రిలీజ్ చేసింది. ఆ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. ఉయిగర్స్, కజక్స్‌తో పాటు ఇతర మైనార్టీలను అక్రమరీతిలో నిర్బంధిస్తున్నారని అమ్నెస్టీ ఆరోపించింది. డిటెన్షన్ సెంటర్లో బంధించి.. తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నది.
జిన్జియాంగ్ ప్రావిన్సులో చైనా అత్యంత దుర్భరమైన నరకాన్ని సృష్టిస్తున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ ఆగ్నెస్ కల్లమార్డ్ తెలిపారు. వేలాది సంఖ్యలో మైనార్టీ ముస్లింలను, ఇతరులను జైళ్లలో నిర్బంధించి వారిని వేధిస్తున్నారని, ఇక లక్షలాది మందిపై నిఘా పెట్టి వారంతా భయంలో జీవించేలా చేస్తున్నట్లు కల్లమార్డ్ ఆరోపించారు. చైనాలో మైనార్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడంలో ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ గుటెర్రస్ విఫలమైనట్లు ఆమె పేర్కొన్నారు. 55 మంది నిర్బంధ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసిన అమ్నెస్టీ మొత్తం 160 పేజీల నివేదికను రిలీజ్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

