చాలామంది పులులు, ఇతర వన్యప్రాణులను చూసేందుకు అభయారణ్యాలకు సఫారీకి వెళ్తుంటారు. కొందరికి పులులు కనిపిస్తాయి. మరికొందరు నిరాశతో వెనుదిరుగుతారు. కానీ టాంజానియాలో సఫారీకి వెళ్లిన కొందరికి చిరుతపులి అతిదగ్గరగా కనిపించింది. వారి వాహనంపై రూఫ్‌పై రాగానే, వారు గట్టిగా అరిచారు. అది కూల్‌గా ఉండడంతో సెల్ఫోన్లు తీసి ఫొటోలు తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
టాంజానియాలోని సెరెంగేటి జాతీయ ఉద్యానవనంలో చిరుతపులి సఫారీ వాహనంపైకి ఎక్కింది. చిరుతపులిని చూసిన సందర్శకులు షాక్‌కు గురయ్యారు. అది మొదట వాహనం చక్రంపైకి దూకింది. తర్వాత రూఫ్‌పైకి వెళ్లింది. పర్యాటకులకు ఎలాంటి హాని తలపెట్టలేదు. ఈ వీడియోను ‘మ్యాన్ ఇన్ వైల్డ్’ అనే క్యాప్షన్‌తో సురేందర్ మెహ్రా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
Man in Wild ..#WildlifeTourism #AnimalBehaviour #Cheetah 🐆 @susantananda3 pic.twitter.com/QbQ223eiEJ
— Surender Mehra IFS (@surenmehra) July 2, 2022