కొరియన్ డ్రామా ‘స్క్విడ్ గేమ్స్’.. 2021లో నెట్ఫ్లిక్స్లో అత్యధికమంది వీక్షించిన టీవీ సిరీస్. ఇందులో ‘స్క్విడ్ గేమ్స్’ అంటే చాలామందికి క్రేజ్. ఇందులో ఆటగాళ్లు ‘రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగిపోతారు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు కదులుతారు. ఇందులో ఓడిపోయిన ఆటగాడిని షూట్చేస్తారు. ఈ గేమ్ చూసి ఓ పిల్లి ఇన్స్పైర్ అయ్యింది. తన యజమానితో కలిసి స్క్విడ్ గేమ్ ఆడి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘బిటెంగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో యజమాని రెడ్లైట్ వేయగానే పిల్లి ఆగిపోతుంది. గ్రీన్లైట్ వేయగానే ముందుకు కదులుతుంది. లైట్లకు అనుగుణంగా పిల్లి చాకచక్యంగా గేమ్ ఆడడం నెటిజన్లను కట్టిపడేసింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 4లక్షల 80వేల మంది వీక్షించారు. 34వేల లైక్స్ వచ్చాయి.
Master of red light, green light.. 😅 pic.twitter.com/QSKiDBykY4
— Buitengebieden (@buitengebieden) May 15, 2022