Justin Trudeau | ట్రూడోకు తగ్గుతున్న ప్రజాదరణ.. 50 ఏళ్లలో అత్యంత చెత్త ప్రధానిగా
Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)కు తాజాగా గట్టి షాక్ తగిలింది. దేశంలో ప్రధానిగా ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది (Losing Popularity).
Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)కు తాజాగా గట్టి షాక్ తగిలింది. దేశంలో ప్రధానిగా ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది (Losing Popularity). కెనడియన్స్ ఎక్కువమంది ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పోయిలీవర్ (Pierre Poilievre) వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రధానిగా 40 శాతం మంది ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు. కెనడాకు చెందిన గ్లోబల్ న్యూస్ అనే సంస్థ నిర్వహించిన పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. ఏడాది క్రితం నిర్వహించిన సర్వేతో పోలిస్తే.. ప్రధానిగా పియరీ పాపులారిటీ ఐదు శాతం పెరగడం విశేషం. ఇక ట్రూడో పాపులారిటీ మాత్రం నిలకడగా 31 శాతం వద్దే స్థిరపడింది.
కెనడాలో 2025లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీకి 39 శాతం ఓట్లు వస్తాయని పోల్స్‌లో తేలింది. ఇక లిబరల్‌పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత ప్రధాని ట్రూడో 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని గ్లోబల్ న్యూస్ నివేదించింది. అదేసమయంలో ట్రూడోకు మద్దతు తెలుపుతున్న న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ ప్రజాదరణ సైతం మసకబారుతోంది.
ఏడాది క్రితంతో పోలిస్తే నాలుగు శాతం తగ్గింది. ఏడాది క్రితం ఆయనకు మద్దతు తెలుపుతున్న వారు 26 శాతం కాగా, ఆ సంఖ్య ఇప్పుడు 22శాతానికి పడిపోయింది. అన్నింటి కంటే ముఖ్యంగా దాదాపు 60 శాతం మంది కెనడియన్స్ ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు ఈ పోల్స్‌లో తేలింది. అదేవిధంగా 50 ఏళ్లలో ట్రూడో అత్యంత చెత్త ప్రధానమంత్రిగా(Worst Prime Minister In 50 Years) ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. సీటీవీ న్యూస్ ప్రకారం.. ట్రూడో తండ్రి పియరీ ట్రూడో 1968- 1979, 1980- 1984 వరకు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

