హామిల్టన్: గురి తప్పిన తూటా కెనడాలో భారతీయ విద్యార్థిని హర్సిమ్రత్ రణధవా (21)ని బలి తీసుకుంది. ఆమె హామిల్టన్‌లోని మొహాక్ కాలేజీలో చదువుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె బుధవారం రాత్రి 7 గంటల సమయంలో కార్యాలయానికి వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్‌లో వేచి చూస్తుండగా సమీపంలో ఇద్దరు కారు డ్రైవర్ల మధ్య కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో గురి తప్పిన తూటాల్లో ఒకటి రణధవా ఛాతీలోకి దూసుకెళ్లింది. పోలీసులు బాధితురాలిని దవాఖానకు తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతురాలి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు టొరంటోలోని ఇండియన్ కాన్సులర్ జనరల్ తెలిపింది.