Canada elections : ఎన్నికల బరిలో 49 మంది భారత సంతతి వ్యక్తులు
Canada elections : కెనడా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో 49 మంది భారతీయ సంతతి వ్యక్తులు

టొరంటో: (Canada elections) కెనడా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో 49 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు. వీరిలో రక్షణ మంత్రి హర్జీత్ ఎస్ సజ్జన్తోపాటు ప్రస్తుత క్యాబినెట్‌లోని ముగ్గురు మంత్రులున్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆగస్టు 15 న ముందస్తు ఎన్నికలు జరిపేందుకు ప్రకటన చేశారు. కొత్త పార్లమెంటును ఎన్నుకొనేందుకు ఈనెల 20 న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ కంటే రెండేండ్ల ముందుగానే ఎన్నికలు జరుగనున్నాయి. ప్రపంచంలో అత్యధిక టీకాలు వేసిన దేశాలలో ఒకటిగా నిలిచామన్న విషయాన్ని ఉపయోగించుకుని ముందస్తు ఎన్నికల్లో లాభపడాలని జస్టిన్ ట్రూడో ప్రయత్నించారు.
ఈసారి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి 16 మంది, ట్రూడోస్ లిబరల్ పార్టీ నుంచి 15 మంది , జగ్మీత్ సింగ్ న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నుంచి 12 మంది, రైట్ వింగ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నుంచి ఆరుగురు బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 20 మంది ఇండో-కెనడియన్లు, 19 మంది పంజాబీలు ఎంపీలుగా ఎన్నికవగా.. వీరిలో నుంచి నలుగురు క్యాబినెట్ బెర్తులను దక్కించుకున్నారు. తాజా అభిప్రాయ సేకరణల ప్రకారం, ట్రూడోస్ లిబరల్ పార్టీ-విపక్ష కన్జర్వేటివ్ పార్టీ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. అభిప్రాయ సేకరణలో
జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని ఎన్డీపీ మూడవ స్థానంలో ఉన్నది. ప్రస్తుతం వీరికున్న 24 మంది ఎంపీల సంఖ్య మెరుగుపడే అవకాశాలున్నాయి. మావెరిక్ పార్టీ, మారిజునా పార్టీ, యానిమల్ ప్రొటెక్షన్ పార్టీ ఆఫ్ కెనడాలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. 2015 పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి దివంగత లిబరల్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడు ట్రూడో.. కెనడా చరిత్రలో రెండో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా నిలిచారు.
ఇవి కూడా చదవండి..
రానున్న రోజుల్లో ఆఫ్ఘన్‌గా మారనున్న కేరళ : కేజే ఆల్ఫోన్స్
టెస్లాకు పోటీగా రంగంలోకి లూసిడ్ కారు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
మోదీకి ప్రత్యామ్నాయం మమతయే.. రాహుల్ కాదు
ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

