ByteDance Founder: చైనా సంపన్నుల జాబితాలో బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు
ByteDance Founder: బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్.. చైనా సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్ కొట్టేశాడు. అతని వ్యక్తిగత సంపద 49.3 బిలియన్ల డాలర్లుగా ఉన్నది. ఈసారి చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. సంపన్నుల జాబితాలో వెనుకపడిపోయారు.
బీజింగ్: బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు(ByteDance Founder) జాంగ్ యిమింగ్.. చైనా సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్ కొట్టేశాడు. అతని వ్యక్తిగత సంపద 49.3 బిలియన్ల డాలర్లుగా ఉన్నది. ఈసారి చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. సంపన్నుల జాబితాలో వెనుకపడిపోయారు. 2021లోనే బైట్‌డ్యాన్స్ ఈసీవో బాధ్యతల నుంచి జాంగ్ తప్పుకున్నారు. హురన్ చైనా సంపన్నుల జాబితా ప్రకారం.. గడిచిన 26 ఏళ్లలో రిచెస్ట్ పర్సన్‌గా నిలిచిన 18వ వ్యక్తిగా జాంగ్ నిలిచాడు.
వాటర్ బాటిల్ వ్యాపారి జోంగ్ షాన్షాన్ను బైట్ డ్యాన్స్ ఓనర్ దాటేశాడు. రెండో స్థానంలో నిలిచిన షాన్షాన్ సంపద 47.9 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. అతని ఆస్తి విలువ 24 శాతం పడిపోయింది. బైట్‌డ్యాన్స్ సంస్థకు అమెరికాలో న్యాయపరమైన సమస్యలు ఉన్నా.. ఆ సంస్థ రెవన్యూ గత ఏడాది 30 శాతం పెరిగింది. మూడవ స్థానంలో టెన్సెంట్ వ్యవస్థాపకుడు పోనీ మా, నాలుగవ స్థానంలో పీడీడీ హోల్డింగ్స్ ఫౌండర్ కొలిన్ హువాంగ్ ఉన్నారు. చైనా బిలియనీర్ల జాబితా నుంచి ఈసారి సుమారు 142 మంది ఔటయ్యారు.
సంపన్నుల జాబితాలో చైనా రియల్ ఎస్టేట్ రంగం దిగ్గజాల సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి సంపన్నుల జాబితాలో చోటు సంపాదించే వారి సంఖ్య పెరిగింది. జియోమీ ఫౌండర్ లీ జున్ ఈ ఏడాది సుమారు 5 బిలియన్ల డాలర్ల సంపదను జోడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

