Julian Assange | జైలులో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే పెళ్లి..
WikiLeaks founder Julian Assange | వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే పెళ్లికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన త్వరలో జైలులోనే స్టెల్లా మోరిస్‌ను

లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే పెళ్లికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన త్వరలో జైలులోనే స్టెల్లా మోరిస్‌ను మనువాడనున్నారు. ప్రస్తుతం అసాంజే బెల్మార్ష్ జైలులో ఉన్నారు. స్టెల్లాను పెళ్లి చేసుకునేందుకు 2015లోనే అసాంజే నిశ్చితార్థం చేసుకోగా.. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు కుమారులున్నారు. ఈక్వెడాల్లో ఆశ్రయం పొందిన సమయంలో ఇద్దరు కొడుకులు జన్మించారు. బ్రిటన్ ప్రిజన్ సర్వీస్ అసాంజే పెళ్లి చేసుకునేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు అంగీకారం తెలిపింది.
సాధారణ ఖైదీల మాదిరిగానే జైలర్ అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటాడని ప్రభుత్వం పేర్కొన్నది. యూకే చట్టం ప్రకారం.. ఖైదీలు 1983 వివాహ చట్టం ప్రకారం జైలులో వివాహం చేసుకునేందుకు అనుమతి ఉన్నది. అయితే, ఇందుకయ్యే ఖర్చురును పెళ్లి చేసుకున్న వ్యక్తులే చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. స్టెల్లా మోరిస్‌ను జూలియన్ అసాంజే 2011 సంవత్సరంలో కలిశారు. లండన్‌లో ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో స్టెల్లా అక్కడికి వచ్చి వెళ్తుండే వారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

