లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భార్య క్యారీ మరోమారు గర్భం దాల్చారని బ్రిటిష్ మీడియాలో శనివారం వార్తలు వచ్చాయి. గతేడాది ఏప్రిల్‌లో క్యారీ తొలి బాబు విల్ఫ్రెడ్కు జన్మనిచ్చారు.
సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో క్యారీ తన స్నేహితులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. మరోమారు గర్భం దాల్చనున్న తనను ఆశీర్వదించాలని కోరారు.
ఈ ఏడాది ప్రారంభంలో గర్భస్రావానికి గురయ్యాయని కూడా పేర్కొన్నారు. క్యారీ వచ్చే డిసెంబర్లో మరో బిడ్డకు జన్మనిస్తారని బ్రిటన్ మీడియా కథనాల సారాంశం.
బోరిస్ జాన్సన్, క్యారీ ఈ ఏడాది మే నెలలోనే దంపతులయ్యారు. 57వ వసంతంలో అడుగిడిన బోరిస్ జాన్సన్ ఇంతకుముందు రెండుసార్లు వివాహం చేసుకున్నారు.
అయితే, ఎంత మంది పిల్లలకు తండ్రినన్న విషయం చెప్పడానికి నిరాకరించారు. ఆయనకు రెండో భార్య మరీనా వీలర్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు.