Parkinson’s Disease | న్యూఢిల్లీ, జూన్ 19: ఒక సాధారణ రక్త పరీక్షతో పార్కిన్సన్స్ వ్యాధిని 7 ఏండ్ల ముందే గుర్తించవచ్చునని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పార్కిన్సన్స్ వ్యాధిని ముందుగానే పసిగట్టే ‘మెషిన్ లెర్నింగ్’ను యూనివర్సిటీ కాలేజీ లండన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సాయంతో 72 మంది రోగుల రక్త నమూనాలను విశ్లేషించగా, దాంట్లో 80 శాతం మంది పార్కిన్సన్స్ వ్యాధి బారినపడే అవకాశముందని తేలింది. రోగుల మెదడులోని ‘ఆల్ఫా-సిన్క్లిన్’ ప్రొటీన్.. ప్రొఫైల్‌తో రక్తనమూనాలను మెషిన్ లెర్నింగ్ విధానంలో పోల్చి పార్కిన్సన్స్ను కొన్నేండ్ల ముందే గుర్తించవచ్చు.