వాషింగ్టన్, మే 29: అమెరికాలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్నది. ఈ వ్యాధి కారణంగా ఐయోవాలోని సియోక్స్ కౌంటీలో రైతులు 40 లక్షల కోళ్లను హననం చేయనున్నారు. 2022 తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో బర్డ్ ఫ్లూ వ్యాపించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
ఐయోవాలో తొలిసారిగా డిసెంబర్లో ఈ వ్యాధి వ్యాప్తిని గమనించారు. అమెరికాలో మొత్తం గుడ్లు, చికెన్ ఉత్పత్తిలో 12 శాతం ఇక్కడి నుంచే వస్తుంది.