వాషింగ్టన్: స్వలింగ సంపర్కులకు చట్టబద్దత కల్పించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంబరాలను జరుపుకునేందుకు వైట్‌హౌజ్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గే మ్యారేజ్ బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయనున్న నేపథ్యంలో శ్వేత సౌధంలో మ్యూజికల్ పర్ఫార్మెన్స్ కూడా ఏర్పాటు చేశారు. కోలరాడోకు చెందిన క్లబ్ క్యూ ఓనర్ ఈ ఈవెంట్లో పాల్గొనున్నారు. గే మ్యారేజ్‌లకు చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశంతో ఆ బిల్లుపై బైడెన్ సంతకం చేయనున్నారు.