కాలిఫోర్నియా: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వ్యాఖ్యానించారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ సమావేశంలో పాల్గొనేందుకు జిన్పింగ్ అమెరికాకు వచ్చారు.
జిన్సింగ్ నియంతని గతంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘అవును ఆయన నియంతే. ఆయన కమ్యూనిస్టు దేశాన్ని పాలిస్తున్నారు’ అని బైడెన్ అన్నారు.