Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగినట్లు ప్రధాని బెంజిమన్ నెతన్యహూ ఆరోపించారు. ఖతార్ నుంచి అరబ్ ఓటర్లకు డబ్బులు అందినట్లు లికుడ్ పార్టీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ షిన్ బెట్ ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జెరుసలాం: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగినట్లు ప్రధాని బెంజిమన్ నెతన్యహూ (Benjamin Netanyahu)ఆరోపించారు. ఖతార్ నుంచి అరబ్ ఓటర్లకు డబ్బులు అందినట్లు లికుడ్ పార్టీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ షిన్ బెట్ ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. షిన్బెట్కు అందిన సమాచారం ఆధారంగా విదేశీ జోక్యం కోణంలో దర్యాప్తు జరగనున్నది. తాజాగా జరిగిన ఎన్నికల్లో నెతన్యహూకు చెందిన లికుడ్ పార్టీకి 53 సీట్లు దక్కాయి. ఇక ప్రతిపక్ష యాషర్ పార్టీకి 48 సీట్లు దక్కాయి. ఇంకా అరబ్ స్థానాలకు చెందిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
ప్రస్తుతం ఎన్నికల్లో నెతన్యహూ పార్టీకి మెజారిటీ దక్కలేదు. తాజా సమాచారం ప్రకారం ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ కోసం మరో 8 సీట్లు కావాల్సి ఉంది. అయితే అరబ్ ఓట్ల ఆధారంగా నెతన్యహూ భవితవ్యం తేలనున్నది. అరబ్ ఓట్ల అంశంలో రిగ్గింగ్ జరిగినట్లు ఆయన ఆరోపణలు చేశారు. అరబిక్ ఓటర్లను ఆకర్షించేందుకు ఖతార్ వాళ్లకు డబ్బులు పంపినట్లు లికుడ్ పార్టీ ఆరోపించింది. అరబ్ పార్టీలు ఎన్నికలను దోచినట్లు వస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు.దీనికి ఆధారాలు లేవన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

