లండన్: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) సుమారు 2 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. భవిష్యత్తు నిధులపై మంత్రులతో చర్చలు జరగనున్న వేళ ఈ అంశం బయటకు వచ్చిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. తన వ్యయంలో పది శాతం తగ్గించుకోవడం కోసం న్యూస్ డివిజన్‌తో పాటు అన్ని విభాగాల్లో కొన్ని ఉద్యోగాలను తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది.
ఈ కోతలు కొన్ని నిర్దిష్ట రేడియో షోలపై ప్రభావం చూపనున్నాయి. ఆర్థికంగా స్థిరమైన భవిష్యత్తు కోసం కఠిన, ప్రజాదరణ లేని నిర్ణయాలు ఉంటాయని గత నెలలో బీబీసీ కొత్త డైరెకర్ట్ జనరల్ మాట్ బ్రిటిన్ ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో హెచ్చరించారు.