Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
Barack Obama | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై మాజీ అధ్యక్షుడు (US Ex President) బరాక్ ఒబామా (Barack Obama) తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి ఒహాయో (Ohio) లోని క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభ (Election Rally) లో ఆయన మాట్లాడారు.
Barack Obama : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై మాజీ అధ్యక్షుడు (US Ex President) బరాక్ ఒబామా (Barack Obama) తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి ఒహాయో (Ohio) లోని క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభ (Election Rally) లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఇరాన్ (Iran) తో ఉద్రిక్తతలు, సుంకాల విధింపు, అధ్యక్ష పదవిని స్వప్రయోజనాలకు వాడుకోవడం లాంటి అంశాలపై ఒబామా తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎవరూ కోరుకోని, ఎవరూ ఓటు వేయని అనవసరమైన యుద్ధానికి ట్రంప్ తెరలేపారని ఒబామా విమర్శించారు. తన హయాంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం కారణంగా ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించాల్సిన అవసరం లేకుండానే ఇరాన్‌ను అణ్వాయుధాల తయారీ నుంచి నిరోధించగలిగామని ఆయన గుర్తుచేశారు. అయితే గత ఏడు నెలలుగా సాగుతున్న ఘర్షణలవల్ల మిత్రదేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని, ఈ దాడుల్లో అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పలువురు గాయపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.
హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు పట్టుచిక్కడంవల్లే చమురు, డీజిల్ ధరలు పెరిగాయని ఒబామా మండిపడ్డారు. డొనాల్డ్ ట్రంప్‌కు సుంకాలంటే అమితమైన ఇష్టమని, అయితే వాటి భారం అంతిమంగా వినియోగదారులపైననే పడుతుందని హెచ్చరించినా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ట్రంప్ పాలనను ఒక “మోసపూరిత వ్యవస్థ (గ్రిఫ్టర్ ప్రెసిడెన్సీ)ష గా, మోసపూరిత పాలనగా ఆయన అభివర్ణించారు. అధ్యక్ష పదవిని ట్రంప్ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.
మీమ్ కాయిన్లు, తన సంతానానికి చెందిన కంపెనీలకు పన్ను చెల్లింపుదారుల నిధులతో కాంట్రాక్టులు కట్టబెట్టడం, వెనిజులాకు చెందిన బిలియనీర్‌కు క్షమాభిక్ష ప్రసాదించడం వంటి అంశాలను ఈ సందర్భంగా ఒబామా ఉదహరించారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడానికి లభించిన ఆఖరి అవకాశమని ఒబామా పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఒహాయో గవర్నర్ అభ్యర్థి అమీ యాక్టన్, సెనేట్ అభ్యర్థి షెర్రాడ్ బ్రౌన్‌లకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

