Barack Obama | 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం అందులో ఒబామా ఒకరు!
Barack Obama | ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధం తర్వాత అగ్రరాజ్యం అమెరికా (America)-రష్యా (Russia) మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో క్రెమ్లిన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా రష్యా.. యూఎస్‌పై ప్రతిస్పందనకు పూనుకుంది.
Barack Obama | ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధం తర్వాత అగ్రరాజ్యం అమెరికా (America)-రష్యా (Russia) మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో క్రెమ్లిన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా రష్యా.. యూఎస్‌పై ప్రతిస్పందనకు పూనుకుంది. ఇందులో భాగంగానే సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) సహా పలువురు ప్రముఖులపై ఆంక్షలు విధించింది. మొత్తం 500 మంది అమెరికన్లు ( 500 Americans) తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం (Banned) విధించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ (Russia Foreign Ministry) శుక్రవారం వెల్లడించింది.
యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రభుత్వం విధించిన రష్యా వ్యతిరేక ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నిషేధం విధించినట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు నిషేధించిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు ఒబామాతోపాటు అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్, టెలివిజన్ స్టార్స్ స్టీఫెన్ కోల్‌బెర్గ్, జిమ్మీ కిమ్మెల్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అదేవిధంగా ఈ జాబితాలో 45 మంది యూఎస్ చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు కూడా ఉన్నారు. అయితే ఏయే కారణాలతో వీరిపై నిషేధం విధించారన్న విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.
గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్కోవిచ్ (Evan Gershkovich)కు కాన్సులర్ యాక్సెస్ కోసం చేసిన అమెరికా అభ్యర్థనను కూడా తిరస్కరించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో ఐక్యరాజ్యసమితిలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ (Sergei Lavrov) పర్యటనను కవర్ చేయాలనుకున్న రష్యా జర్నలిస్టులకు అమెరికా వీసాలు నిరాకరించింది. ఆ చర్యకు ప్రతిస్పందనగానే.. ఇవాన్‌కు కాన్సులర్ యాక్సెస్‌ను తిరస్కరిస్తున్నట్లు మాస్కో తెలిపింది. కాగా, గూఢచర్యం కేసులో ఇవాన్‌ను ఈ ఏడాది మార్చిలో రష్యా పోలీసులు అరెస్టు చేశారు.
Also Read..
Earthquake | పసిఫిక్ మహాసముద్రంలో వరుసగా రెండో రోజూ భారీ భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు
Dhoop Sticks | యాదగిరిగుట్టలో దేవుని పూలతో పరిమళాలు వెదజల్లే అగరబత్తీల తయారీ.. వీడియో
Summer Diet | సమ్మర్లో ఆరోగ్యంగా ఉండాలా? అయితే ఈ ఫుడ్‌ను మీ డైట్లో చేర్చుకోవడం మస్ట్ !
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

