Earthquake | పసిఫిక్ మహాసముద్రం ( Pacific Ocean) ఆగ్నేయ ప్రాంతాన్ని వరుస భూకంపాలు
(Earthquake) భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న న్యూ కలెడోనియా (New Caledonian)కు
తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
శనివారం ఉదయం అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.1 గా
నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (US Geological Survey ) తెలిపింది.
సముద్ర ఉపరితలానికి 35 కిలోమీటర్ల లోతులో, న్యూ కలెడోనియన్ ద్వీపసమూహానికి తూర్పున 300
కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సమీపంలోని
ద్వీపదేశాలైన వనౌతు, ఫిజీ, న్యూకలెడోనియా, కిరిబాటి, వాలిస్, ఫుటునా దేశాలకు సునామీ (Tsunami)
పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది.
Also Read..
F-16 Fighter Jets: ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపనున్న అమెరికా
Summer Diet | సమ్మర్లో ఆరోగ్యంగా ఉండాలా? అయితే ఈ ఫుడ్‌ను మీ డైట్లో చేర్చుకోవడం మస్ట్ !
Hyderabad | భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. వేధింపులు తాళలేక పెండ్లయిన 13 రోజులకే నవవధువు ఆత్మహత్య