Bangladesh | ఢాకా: మాజీ ప్రధాని షేక్ హసీనా విధేయులపై ఉక్కుపాదం మోపుతూ బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భద్రతా ఆపరేషన్ చేపట్టింది. దీన్ని ఆపరేషన్ డెవిల్ హంట్‌గా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ అధిపతి జహంగీర్ ఆలం చౌదరి అభివర్ణించారు.
గత ఏడాది ఉద్యమాన్ని రగిల్చిన స్టూడెంట్స్ ఎగెనెస్ట్ డిస్క్రిమినేషన్‌కు చెందిన విద్యార్థులపై ఢాకా జిల్లాలోని గాజీపూర్‌లో దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న గ్రూపు సభ్యులు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ చేపట్టినట్టు ప్రకటించింది.