F7 jet crashes | ఘోర ప్రమాదం.. పాఠశాలపై కూలిన శిక్షణ విమానం
F7 jet crashes | బంగ్లాదేశ్ (Bangladesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శిక్షణ విమానం ఓ పాఠశాల భవనంపై కుప్పకూలిపోయింది.
F7 jet crashes | బంగ్లాదేశ్ (Bangladesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శిక్షణ విమానం ఓ పాఠశాల భవనంపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 (Bangladesh Air Forces F7 jet) శిక్షణ విమానం సోమవారం ఢాకా (Dhaka)లోని మైల్స్టోన్ స్కూల్, కళాశాల (Milestone School and College) భవనంపై కూలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. విమానం కూలిన వెంటనే ప్రమాద స్థలం నుంచి మంటలు, నల్లటి పొగ ఎగసిపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పలువురు విద్యార్థులకు కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మైల్స్టోన్ కళాశాల క్యాంటీన్ పైకప్పును విమానం ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులను ఊటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది.
కాగా, F-7 జెట్ చైనా తయారు చేసింది. చైనా నిర్మిత F-7 కూలిపోవడం ఇది ఈ ఏడాదిలో రెండో ఘటన కావడం గమనార్హం. గత నెలలో మయన్మార్ వైమానిక దళానికి చెందిన F-7 ఫైటర్ జెట్ సాగింగ్ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే. నెల వ్యవధిలోనే రెండు చైనా నిర్మిత F-7 జెట్లు కూలిపోవడంతో బీజింగ్ ఉత్పత్తి చేసే రక్షణ పరికరాల నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
Rahul Gandhi | ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వట్లేదు : రాహుల్ గాంధీ
Landslides | మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురికి గాయాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

