ఒట్టావా: సాధారణంగా తల్లి గర్భాశయంలో పిండం ఎదుగుతుంది. అయితే కెనడాకు చెందిన 33 ఏండ్ల మహిళ కాలేయంలో పిండం పెరుగుతుండటాన్ని అక్కడి వైద్యుడు మైఖెల్ నార్వే అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించారు. అరుదుగా జరిగే ఇలాంటి ఘటనల్లో 1-2 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాణాలతో పుడుతారని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్లు సిజేరియన్ ద్వారా పిండాన్ని తొలగించే పనిలో పడ్డారు.