చోరీకి గురైన ఆ కళాఖండాలను భారత్‌కు తిరిగి అప్పగించనున్న ఆస్ట్రేలియా

సిడ్నీ: ఇండియాలో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన కళాఖండాలను ఇండియాకు తిరిగి అప్పగించనుంది ఆస్ట్రేలియా. మొత్తం 14 కళాఖండాలను అప్పగించనుండగా ఇందులో ఆరు ఇండియాలో చోరీకి గురవడం లేదా ఆస్ట్రేలియాలోకి అక్రమంగా వచ్చినట్లు అక్కడి నేషనల్ గ్యాలరీ గురువారం వెల్లడించింది. క్యాన్బెరా గ్యాలరీ ఇప్పటికే వీటిని గుర్తించింది. వీటిలో శిల్పాలు, ఫొటోలు, పెయింటింగ్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మత, సాంస్కృతిక పరమైన కళాఖండాలని, వీటి విలువ 22 లక్షల డాలర్లుగా ఉందని అక్కడి గ్యాలరీ చెప్పింది. వీటిలో కొన్ని 12వ శతాబ్దానికి చెందినవి కూడా ఉండటం విశేషం.
వీటన్నింటినీ కొన్ని నెలల్లోనే భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగించనున్నట్లు గ్యాలరీ డైరెక్టర్ నిక్ మిట్జెవిచ్ చెప్పారు. తమ చరిత్రలోని ఓ క్లిష్టమైన అధ్యాయానికి ఇలా ముగింపు పలకబోతున్నట్లు ఆయన తెలిపారు. వాటిని ఇండియాకు తిరిగి ఇవ్వడం తమకు ఎంతో ఊరట కలిగించేదని అన్నారు. ఈ మొత్తం 14 కళాఖండాల్లో 13 అక్రమ రవాణాదారు సుభాష్ కపూర్‌కు చెందినవే. అతని ద్వారా అందుకున్న పలు కళాకృతులను ఇప్పటికే నేషనల్ గ్యాలరీ తిరిగి ఇండియాకు అప్పగించింది. వీటిలో తమిళనాడులోని ఆలయం నుంచి చోరీ చేసిన శివుని విగ్రహం కూడా ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
Congress Minister | బెడిసికొట్టిన మంత్రి వ్యూహం.. ముఖ్య పదవిని ఆశిస్తే అసలుకే మోసం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

