ఆస్ట్రేలియాలో వీసా నిబంధనలు కఠినతరం
విద్యార్థి వీసా నిబంధనలను ఆస్ట్రేలియా కఠినతరం చేసింది. తద్వారా అంతర్జాతీయ విద్యా మార్గాలపై కఠిన ఆంక్షలు విధిస్తున్న అమెరికా, కెనడా సరసన ఆస్ట్రేలియా కూడా చేరింది.
- భారత్‌లోని 6 రాష్ర్టాల విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: విద్యార్థి వీసా నిబంధనలను ఆస్ట్రేలియా కఠినతరం చేసింది. తద్వారా అంతర్జాతీయ విద్యా మార్గాలపై కఠిన ఆంక్షలు విధిస్తున్న అమెరికా, కెనడా సరసన ఆస్ట్రేలియా కూడా చేరింది. ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ యూనివర్సిటీ, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, విక్టోరియా యూనివర్సిటీ, సదరన్ క్రాస్ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలు భారత్‌లోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్ రాష్ర్టాల విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేశాయి.
విద్యార్థి వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా ఈ ఆంక్షలు విధించారు. ఈ పరిణామం భారత్‌లోని, ముఖ్యంగా గుజరాత్‌లోని వీసా కన్సల్టెంట్లు, విద్యార్థుల్లో అశాంతిని సృష్టించింది. ఉన్నత విద్య కోసం గుజరాత్ విద్యార్థులు ఆస్ట్రేలియాను అత్యున్నత గమ్యస్థానంగా పరిగణిస్తుండటమే ఇందుకు కారణం. విదేశాల్లో చదువుకోవాలనుకునే గుజరాత్ విద్యార్థుల్లో దాదాపు 20% మంది ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్నట్టు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు చెప్తున్నారు. కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా కొత్త ఆంక్షలు విధించడం వల్ల ఇకపై గుజరాత్ నుంచి ఆ దేశానికి వెళ్లాలనుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

