Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష
Aung San Suu Kyi మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. ఆ దేశ సైనిక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దీంతో ఆమెకు వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష మొత్తం 33 ఏళ్లకు చేరుకున్నది. 2021 ఫిబ్రవరిలో ఆ దేశ
యంగూన్: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. ఆ దేశ సైనిక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దీంతో ఆమెకు వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష మొత్తం 33 ఏళ్లకు చేరుకున్నది. 2021 ఫిబ్రవరిలో ఆ దేశ సైన్యం.. ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆంగ్ సాన్ సూకీ హౌజ్ అరెస్టులో ఉన్నారు. మొత్తం 19 అభియోగాలపై ఆమె 18 నెలల పాటు విచారణలను ఎదుర్కొన్నారు. సూకీని రిలీజ్ చేయాలని ఇటీవల యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ఓ ప్రకటనలో కోరింది.
సూకీపై ఉన్న చివరి అయిదు కేసుల్లో శుక్రవారం విచారణ జరిగింది. ఆమె అవినీతికి పాల్పడినట్లు కోర్టు దోషిగా తేల్చింది. హెలికాప్టర్‌ను ఓ మంత్రికి రెంట్ ఇచ్చిన విషయంలో ఆమె నియమావళిని ఉల్లంఘించినట్లు తెలిసింది. గతంలో 14 కేసుల్లో ఆమెను విచారించారు. కోవిడ్ నియమావళిని ఉల్లంఘించడంతో పాటు వాకీ టాకీలను దిగుమతి చేయడం, అధికారిక రహస్య చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలోనూ ఆమెను విచారించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

