boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
boat capsizes : ఆఫ్రికా దేశమైన జిబూటి తీరంలో పడవ బోల్తా పడటంతో 109 మంది మరణించారు. మరో 116 మంది గల్లంతయ్యారు. 80 మంది సురక్షితంగా బయటపడ్డారు.
boat capsizes : ఆఫ్రికా దేశమైన జిబూటి తీరంలో పడవ బోల్తా పడటంతో 109 మంది మరణించారు. మరో 116 మంది గల్లంతయ్యారు. 80 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జిబూటి తీరంలో జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేష్ (ఐఓఎం) సంస్థ ఆదివారం తెలిపింది.
350 మంది వలసదారులతో కూడిన నౌక తీర పట్టణమైన జిబూటి నుంచి యెమెన్ బయల్దేరింది. మార్గమధ్యలో, ఉత్తర ఒబోక్ వద్ద, గుహెరో ప్రాంతానికి సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటన అక్టోబర్ 8-9 తేదీల మధ్య రాత్రిపూట జరిగింది. ఈ పడవ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారు నీట మునిగిపోయారు. వీరిలో 109 మంది మరణించారు. మృతుల్లో 15 మంది పిల్లలున్నారు. అలాగే, 52 మంది పురుషులు, 42 మంది మహిళలున్నారు. మరో 116 మంది గల్లంతయ్యారు. 80 మంది సురక్షితంగా బయటపడ్డారు.
వీరంతా ఇథియోపియాకు చెందిన వారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ అంశంపై ఇథియోపియా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇక, ఈ ప్రమాదం ఎలా జరిగింది.. మృతుల సంఖ్య వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Djibouti
- East Africa
- Ethiopia
- Yemen
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

