China | అరుణాచల్‌పై చైనా మళ్లీ అదే మాట..
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మొండి వాదనను భారత్ పదే పదే ఖండిస్తున్నా, ఆ దేశం మళ్లీ పాత మాటనే ఎత్తుకుంది. చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది.
China | బీజింగ్, మార్చి 25: అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మొండి వాదనను భారత్ పదే పదే ఖండిస్తున్నా, ఆ దేశం మళ్లీ పాత మాటనే ఎత్తుకుంది. చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది. అరుణాచల్‌ను భారత్ ఆక్రమించుకుందని మరోమారు నోరుపారేసుకుంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కాలేదు. గతంలో అరుణాచల్ చైనాలో భాగంగానే ఉండేది. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. 1987లో భారత్ ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్‌గా మార్చుకుంది’ అని పేర్కొన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన అనంతరం, ఆ భూభాగం తమదేనంటూ చైనా పదే పదే ప్రకటనలు చేస్తున్నది. చైనా ఈ విధంగా ప్రకటనలు విడుదల చేయటం ఈ నెలలో ఇది నాలుగోసారి. అరుణాచల్‌ను ఆ దేశం దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

