Argentina | అర్జెంటీనా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..!
Argentina | అర్జెంటీనా (Argentina) అధ్యక్షుడు జావియెర్ మిలీ (Javier Milei) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని (Fire Government Workers) యోచిస్తున్నారు.
Argentina | అర్జెంటీనా (Argentina) అధ్యక్షుడు జావియెర్ మిలీ (Javier Milei) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని (Fire Government Workers) యోచిస్తున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
ఆ నివేదిక ప్రకారం.. మరి కొద్ది నెలల్లో 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని జావియెర్ యోచిస్తున్నారు. ఆర్థికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఆ దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం త్వరలోనే ముగియనుంది. గతేడాదే వీరి కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అయితే, వీరి కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసే ఆలోచన తమకు లేదని అధ్యక్షుడు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
అర్జెంటీనాలో మొత్తం 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అందులో తొలగించే ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వేల మందిని ఒకేసారి తీసేయాలని నిర్ణయించడమే ఆ దేశంలో ఇప్పుడు సంచలనమవుతోంది. అధ్యక్షుడి నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
Also Read..
Dilip Ghosh | దీదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు
Supriya Shrinate | కంగనపై వివాదాస్పద పోస్ట్ చేసిన సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్
Leopard | అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

