శాన్ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 26: ఐఫోన్లలో ఇకపై యూఎస్బీ -సీ చార్జింగ్ పోర్టును యాపిల్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ విషయాన్ని యాపిల్ ఎగ్జిక్యూటివ్ గ్రెగ్ జోస్వైక్ ధ్రువీకరించారు. అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో ఒకేరకంగా యూఎస్బీ చార్జింగ్ పోర్టు ఏర్పాటుచేయాలని యూరోపియన్ యూనియన్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరించి యాపిల్ అయిష్టంగానే యూఎస్బీ-సీ పోర్టుకు మారనున్నది. ఒకవైపు లైట్నింగ్ పోర్టు, మరోవైపు యూజర్లు తమకు ఇష్టమైన కనెక్టర్‌ను వాడేలా చార్జింగ్ బ్రిక్‌ను రూపొందించనున్నట్టు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా మంగళవారం యాపిల్ ఐమెసేజెస్, ఫేస్‌టైమ్ సేవలూ నిలిచిపోయాయి. అరగంటలోనే సమస్యను పరిష్కరించినట్టు తెలిపింది.