టొరంటో: కెనడాలోని సుమారు 8 లక్షల మంది హిందువులను బహిష్కరించాలని, వారిని భారత్‌కు పంపాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. టొరంటోలో హిందూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. (Anti-Hindu parade by Khalistan) ఈ సందర్భంగా బోనులో ఉంచిన మోదీ, అమిత్ షా, జైశంకర్ దిష్టిబొమ్మలను ప్రదర్శించారు. ఆదివారం టొరంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఈ సంఘటన జరిగింది. కెనడాలోని వేలాది మంది ఖలిస్థానీ సానుభూతిపరులు ఈ హిందూ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు.
కాగా, కెనడాలో నివసిస్తున్న సుమారు 8,00,000 మంది హిందువులను దేశం నుంచి బహిష్కరించాలని, వారిని భారత్‌కు వెళ్లగొట్టాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. హిందువులు, భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిష్టిబొమ్మలు జైలులో ఉన్న నమూనాతో కూడిన వాహనాన్ని ఈ ర్యాలీ సందర్భంగా ప్రదర్శించారు. ఖలిస్థాన్ అనుకూల రాతలతో సిక్కు గురుద్వారా, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సంఘటనల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మరోవైపు కెనడాలోని హిందూ సమాజం ఈ ర్యాలీని ఖండించింది. దీనికి సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ నుంచి కనిపించిన స్పష్టమైన హిందూ వ్యతిరేక ద్వేషమని ఆరోపించారు. ‘ఇది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కాదు. కెనడాలో అత్యంత దారుణమైన దాడులకు పేరుగాంచిన ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ అహంకారంతో అక్కడ ఉండే హక్కును ప్రకటిస్తోంది. ఇది స్పష్టమైన హిందూ వ్యతిరేక ద్వేషం’ అని అందులో పేర్కొన్నారు.
Why is this open hatred being tolerated?
Do we have any authorities with the gonads to tackle this?
(Rhetorical questions, I know)
Khalistan tableau in Nagar Kirtan, a religious event, has people shouting for 800,000 Hindu Canadians to leave Canada.
1/2 pic.twitter.com/L8R2HCGPE2
— Darshan Maharaja (@TheophanesRex) May 5, 2025