Gaza Strip | మాకీ యుద్ధం వద్దు.. హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల భారీ నిరసన
గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా విసిగి వేసారిన పాలస్తీనియన్లు యుద్ధానికి ముగింపు పలికి, అధికారం నుంచి తొలగాలని హమాస్ మిలిటెంట్లపైనే నిరసనకు దిగారు.
- నినదించిన పాలస్తీనా పౌరులు
- గాజాలో పెద్ద ఎత్తున నిరసన
Gaza Strip | కైరో, మార్చి 26: గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా విసిగి వేసారిన పాలస్తీనియన్లు యుద్ధానికి ముగింపు పలికి, అధికారం నుంచి తొలగాలని హమాస్ మిలిటెంట్లపైనే నిరసనకు దిగారు.
2007 నుంచి తమను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లు భారీ నిరసన ప్రదర్శన చేశారు. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తర ప్రాంత పట్టణం బీట్ లేహియాలో వందలాది మంది నిరసనకారులు ప్ల కార్డులు చేతబట్టి హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాల వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాకీ యుద్ధం వద్దు, మేము చావాలనుకోవడం లేదు. మా పిల్లల రక్తం చవక కాదు అంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ.. హమాస్ వైదొలగాలి అంటూ నినాదాలు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

