మెల్బోర్న్: వాతావరణంలో ఉన్న వాయువులను ఎలా ఉపయోగించవచ్చని మనం ఇప్పుడిప్పుడు ఆలోచనలు మొదలుపెట్టాం. మంచుఖండం అంటార్కిటికాలో గాలిలో ఉండే బ్యాక్టీరియాలు మా త్రం ఈ పనిని వందల కోట్ల ఏండ్ల క్రితమే ప్రారంభించాయి. అందుకే నీటి చుక్క లేని మంచు ఎడారిలో గాలిలోని హైడ్రోజన్‌ను గ్రహించి.. నీళ్లలాగా, ఆహారం లాగా మార్చి జీవనాన్ని సాగిస్తున్నాయి. ఈ విషయం ఇటీవలే శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. అంటార్కిటికాలోని 451 రకాల బ్యాక్టీరియాలపై అధ్యయనం చేశారు. వీటిలో చాలావరకు హైడ్రోజన్‌ను గ్రహించే ఆహార అవసరాలను తీర్చుకొంటున్నాయని తేలింది. ఈ బ్యాక్టీరియాల్లో రుబిస్కో అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది గాలిలోని హైడ్రోజన్, కార్బన్, మీథేన్ లాంటి వాయువులతో ఆక్సిజన్‌ను సంశ్లేషనం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.