మిస్ యూనివర్స్ విజేత ఆండ్రియా మెజా..

ఫ్లోరిడా: మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ ఏడాది ఆండ్రియా మెజా విజేతగా నిలిచింది. మెక్సికో దేశానికి చెందిన మెజా.. తన అందాలతో ఆకట్టుకోవడమే కాదు.. జడ్జిలు వేసిన ప్రశ్నలకు చురుకైన సమాధానాలు కూడా ఇచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న హార్డ్ రాక్ హోటల్లో కలర్ఫుల్గా ఈ వేడుక జరిగింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీలను ఏడాది పాటు వాయిదా వేశారు. మే 16వ తేదీన జరిగిన ఈ కార్యక్రమాన్ని మాజీ మిస్ యూనివర్స్ విజేత ఒలివియా కుల్పో నిర్వహించారు. స్టేట్మెంట్ రౌండ్లో మెక్సికో బ్యూటీ ఆండ్రియా తన ఆన్సర్లతో అందర్నీ మెప్పించింది. మారుతున్న బ్యూటీ ప్రమాణాలపై ప్రశ్న వేయగా.. రోజు రోజుకూ మన సమాజం అడ్వాన్స్ అవుతున్నదని, అలాగే మూస ధోరుణుల్లో ప్రవర్తించేవాళ్లూ ఉన్నారని, అందం అనేది మన ఆలోచనల్లో, మన గుండెల్లో ఉంటుందని, అది మన ప్రవర్తనను నియమిస్తుందని, మన విలువను చాటేందుకు అందం ఒక కొలమానంగా నిలుస్తుందని ఆండ్రియా పేర్కొన్నది.
ఇక మహమ్మారి కరోనా పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారని కూడా జడ్జిలను ఆమెను ప్రశ్నించారు. కోవిడ్ లాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరైన పద్ధతి అంటూ ఏదీ లేదని, ఒవకేళ తానే నేతనైతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాను ముందుగా లాక్డౌన్ విధించే దానినని పేర్కొన్నది. ఎందుకంటే కరోనా ఉగ్రరూపం దాలిస్తే ప్రాణాలను కాపాడుకోలేమని, అందుకే లాక్డౌన్ అవసరం అని ఆమె తెలిపింది. మన ప్రజల్ని మనమే రక్షించుకోవాలన్నది. అందుకే ముందు నుంచి లాక్డౌన్ అమలు చేసేదాన్ని అని అందాల భామ ఆండ్రియా పేర్కొన్నది.
74 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఈ ఈవెంట్లో పాల్గొన్నాయి. ఫైనల్ రౌండ్‌కు కేవలం 21 మంది వెళ్లారు. చివరిసారి మిస్ యూనివర్స్ పోటీలను 2019లో నిర్వహించారు. ఆ పోటీల్లో మిస్ సౌతాఫ్రికా జోజిబిని తుంజి విజేతగా నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

