Kenya | న్యూఢిల్లీ: కెన్యాలోని సెయింట్ థెరీసాలో ఉన్న ఓ హైస్కూలులో చదువుతున్న బాలికలు విచిత్ర వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు 95 మంది బాలికల కాళ్లకు పక్షవాతం వంటి వ్యాధి సోకింది. దీంతో వారు సరిగ్గా నడవలేకపోతున్నారు.
ఈ వింత వ్యాధికి కారణాలేమిటో తెలుసుకునేందుకు కెన్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. బాధితుల రక్త నమూనాలను కెన్యా మెడికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. మెరుగైన చికిత్స అందించేందుకు బాధితులను దవాఖానలకు తరలించారు.