Covid Test | కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు.. బిల్లు చూసి షాక్ తిన్నాడు!
కొవిడ్ టెస్ట్( Covid Test ) చేయించుకున్న వారు తమకు ఎక్కడ పాజిటివ్ వస్తుందో అని భయపడటం సహజం. కానీ అమెరికాలోని ఓ వ్యక్తి మాత్రం ఈ టెస్ట్ ఫలితం నెగటివ్‌గా వచ్చినా కూడా షాక్ తిన్నాడు.

డల్లాస్: కొవిడ్ టెస్ట్( Covid Test ) చేయించుకున్న వారు తమకు ఎక్కడ పాజిటివ్ వస్తుందో అని భయపడటం సహజం. కానీ అమెరికాలోని ఓ వ్యక్తి మాత్రం ఈ టెస్ట్ ఫలితం నెగటివ్‌గా వచ్చినా కూడా షాక్ తిన్నాడు. దీనికి కారణం ఆ టెస్ట్ చేయడానికి ఆ సెంటర్ వాళ్లు వేసిన బిల్లు. ట్రెవిస్ వార్నర్ అనే ఆ వ్యక్తి పీసీఆర్ టెస్ట్, యాంటీజెన్ టెస్టులు చేయించుకున్నాడు. దీనికి వాళ్లు వేసిన బిల్లు ఏకంగా 54 వేల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.40 లక్షలు. అమెరికాలో కొవిడ్ టెస్టుల తర్వాత బిల్స్ చూసి షాక్ తిన్న వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. సాధారణంగా ఈ టెస్ట్‌కు 8 నుంచి 15 డాలర్లు మాత్రమే అవుతుంది.
కానీ అమెరికాలో కొవిడ్ టెస్ట్‌లకు వసూలు చేసే చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేదు. దీంతో అప్పుడప్పుడూ ఇలాంటి భారీ బిల్స్ పేషెంట్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. వార్నర్ విషయానికి వస్తే అతనికి మోలినా హెల్త్‌కేర్ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. వాళ్లకు ఈ బిల్లు పంపించగా.. ఎలాగోలా ఆ సెంటర్ వాళ్లను బతిమాలి దానిని 16915 డాలర్లకు తగ్గించి చెల్లించారు. విచిత్రం ఏమిటంటే వార్నర్ భార్య కూడా అదే రోజు, అదే సమయానికి, అదే సెంటర్లో అవే టెస్టులు చేయించుకుంది. ఆమెకు ఆ సెంటర్ వాళ్లు 2 వేల డాలర్ల బిల్లు వేశారు. ఆమెకు మరో ఇన్సూరెన్స్ సంస్థ నుంచి బీమా ఉంది. వాళ్లు ఈ బిల్లును వెయ్యి డాలర్లకు సెటిల్ చేశారు.
నిజానికి వార్నర్ విషయంలో ఆ సెంటర్ వాళ్లు బిల్లింగ్‌లో కొన్ని పొరపాట్లు చేశారని, దానిని తాము గుర్తించిన తర్వాత బిల్లును 16 వేల డాలర్లకు తగ్గించారని మోలినా ఇన్సూరెన్స్ అధికార ప్రతినిధి చెప్పారు. అయినా కూడా కొవిడ్ టెస్టులకు అంత భారీ మొత్తం ఎలా అవుతుందో ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కడం లేదు.
What is wrong w the US?
— Michael Mina (@michaelmina_lab) October 1, 2021
This guys bill for a few tests came to $54,000!!!
His wife’s insurance negotiated her cost down to $1000!!
PCR tests themselves can cost <$5.
Add some labor and overhead and you’re up to $8-15 (generously)
This is horrible.https://t.co/5GdAXX1EZ0
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

