వాషింగ్టన్, అక్టోబర్ 13: ఒక వైపు హమాస్, హెజ్బొల్లా, ఇరాన్లతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోగా, మరో వైపు ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా సిరియాపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్నది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ సంస్థలు నిర్వహిస్తున్న పలు శిబిరాలపై ఆమెరికా వాయుసేన వరుసగా దాడులతో విరుచుకుపడింది.
అమెరికా, దాని మిత్ర దేశాలు లక్ష్యంగా ఐఎస్ దాడులు చేయడానికి కుట్ర పన్నిందని, దీనిని అడ్డుకునేందుకు శుక్రవారం తాము వాయుసేన దాడులు జరిపినట్టు యూఎస్ మిలటరీ తెలిపింది. దాడులు కారణంగా పౌరులెవరూ మరణించలేదని, జరిగిన నష్టాన్ని తమ బృందాలు అంచనా వేస్తున్నట్టు తెలిపాయి. అయితే వారు సిరియాలో ఏ ప్రాంతంలో దాడులు చేసిందీ వెల్లడించ లేదు.